చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 12: హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్‌న్యూ) తొలి కేసులో.. రూ.3.5 లక్షల హెరాయిన్‌ను పట్టుకొన్నది. శాలిబండ పోలీసులతో కలిసి దాడి చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకొని, ఐదుగురు నిందితులను అరెస్టు చేసింది. శనివారం ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయంలో హెచ్‌న్యూ డీసీపీ గుమ్మి చక్రవర్తి మీడియా కు వివరాలు వెల్లడించారు.. రాజస్థాన్‌లోని రాణావ్ధర్కు చెందిన సురేశ్ కుమార్(24) జీడిమెట్లలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన జయంతిలాల్ మంజు అలియాస్ జేడీ మంజు నుంచి హెరాయిన్ తీసుకొచ్చి బాలానగర్‌లో స్టీల్ వర్క్ చేసే కైలాశ్ పురోహిత్ (28), ఎల్బీనగర్లో గ్యాస్ కంపెనీలో పనిచేసే సునీల్ (24), కావర రాము (26), చెంగిచెర్లకు చెందిన ప్రకాశ్ (22)కు అమ్మాడు. పోలీసులు 75 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.