హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ): తెలంగాణ చరిత్రను దృశ్యరూపంలో శాస్త్రీయంగా భావితరాలకు అందించే లక్ష్యంతో ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘బొమ్మల పల్లకి’ వీడియో పోటీల పురసారాల ప్రదానోత్సవ సభ సంగారెడ్డి జిల్లా నందికందిలో ఆదివారం ఘనంగా జరిగింది.
‘సీతమ్మ లొద్ది యాత్ర’ డాక్యుమెంటరీని రూపొందించిన డీ రవీందర్రెడ్డి ప్రథమ పురసారం అందుకోగా, ‘శ్రీరంగాపూర్ రంగనాయకుల చరిత్ర’పై వీడియో రూపొందించిన ఎన్ విష్ణు ద్వితీయ బహుమతిని దకించుకొన్నారు.