Secretariat | సచివాలయం చుట్టూ 163 సెక్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్ (Secretariat) ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు సెక్రటేరియట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు.
హైదరాబాద్: రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్ (Secretariat) ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు సెక్రటేరియట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. పరిపాలన సౌధం చుట్టూ 163 సెక్షన్ విధించారు. సెక్రటేరియట్ పార్కింగ్ గ్రౌండ్లో సుమారు 200 మంది సిబ్బందిని మోహరించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద పోలీసు వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కాగా, వీడియోలు తీయడానికి మీడియాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
శనివారం భార్యాపిల్లలతో రోడ్డెక్కిన కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్లలో ఒకే రోజు 39 మందిని సస్పెన్షన్ చేస్తూ అర్ధరాత్రి వేళ ఉత్తర్వులు ఇచ్చింది. తమ సహోద్యోగులు సస్పెన్షన్ గురికావడంతో వారికి బెటాలియన్ కానిస్టేబుళ్లంతా బాసటగా నిలిచారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని బెటాలియన్ల ముట్టడి చేపట్టారు. గంటలకొద్దీ బెటాలియన్ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టినా.. కమాండెంట్ పట్టించుకోకపోవడంతో పట్టరాని కోపంతో రోడ్డెక్కారు. అనంతరం రాత్రి వేళ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయినప్పటికీ సర్కారులో చలనం రాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకారం సోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లు నగరానికి బయలుదేరినట్టు సమాచారం. పోలీసుల ఆంక్షలు, తనిఖీలు నడుమ.. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ నగరబాట పట్టిన బెటాలియన్ కానిస్టేబుళ్ల సచివాలయ ముట్టడి ఎక్కడికి దారితీస్తుందోనని సర్వత్రా ఆందోళన నెలకొన్నది.

మరోవైపు నగరంలో ఆందోళన నేపథ్యంలో పోలీసులు నెలరోజుల పాటు ఆంక్షలు విధించారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి నవంబర్ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
తెలంగాణ సచివాలయం చుట్టూ 163 సెక్షన్
భారీగా మోహరించిన పోలీసులు https://t.co/nvNuMB2NI2 pic.twitter.com/xF1KKsxeNR
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2024
NTR స్టేడియం వద్ద భారీగా పోలీసుల మోహరింపు https://t.co/z1oTKKBFu0 pic.twitter.com/cWTVF5o6yJ
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

