హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెక్యూరిటీని పెంచారు. గతంలో ఉన్న భద్ర తా సిబ్బందికి అదనంగా రెండు పూర్తిస్థా యి టీములను జోడించారు. సాధారణంగా ముఖ్యమంత్రి బందోబస్తుకు నాలుగు ప్ర త్యేక బృందాలు ఉంటాయి. ఒక అడ్వాన్స్ టీం, ఒక స్పేర్ టీం, రెండు రెగ్యులర్ బృందాలతో భద్రత కల్పిస్తారు. ఒక్కొక్క బృందంలో 48 మంది పోలీసు సిబ్బంది ఉంటారు. వీరిలో డీఎస్పీ సహా ఇన్స్పెక్టర్లు, ఎైస్సె, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్.. ఇలా రకరకాల సిబ్బంది ప్రతీ టీమ్‌లోను ఉంటారు. నాలుగు బృందాలకు అదనంగా మరో రెండు బృందాలను జోడించారు. సీఎం కాన్వాయ్‌లో కూడా అదనంగా రెం డు వాహనాలను పెంచారు. మూడు రోజులుగా సీఎం భద్రతను పెంచినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
ప్రజావ్యతిరేకతే కారణమా?
రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ఇండ్ల తొలగింపు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజ లు ఆందోళన బాటపట్టారు. సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని, సెక్రటేరియేట్ వద్ద ఆందోళనలు చేస్తామని పలు ప్రజాసంఘాలు ప్రకటించాయి. దీంతోపాటు రాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల భారీ ఎత్తున మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో బందోబస్తును పెంచినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.