హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీడియా అకాడమీ పాలకమండలి కమిటీ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిసున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రముఖ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ దినపత్రికల్లో ప్రకటన జారీచేసినట్టు వెల్లడించారు.
ఈ కమిటీలో సభ్యులుగా పనిచేయడానికి ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులను జర్నలిస్టు సంఘాలు తమ ప్రతినిధులుగా ప్రతిపాదించేందుకు దరఖాస్తులను మీడియా అకాడమీ వెబ్సైట్ www.mediaavadamy.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని లేదా నాంపల్లిలోని అకాడమీ కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చని వెల్లడించారు. ఈనెల 30న దరఖాస్తులను సమర్పించాలని కోరారు.