మన యువత పనిమంతులే
భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
- వారానికి 65.4 గంటల పనితో రెండో స్థానం
- దక్షిణ భారత రాష్ర్టాల్లో అగ్రస్థానం కైవసం
- టైమ్ యూజ్’ సర్వే నివేదిక స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు ఇది ముమ్మాటికీ శ్రమశక్తిని దోచుకోవడమేనన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో రాష్ర్టాలవారీగా యువత వారంలో ఎన్ని గంటలు పనిచేస్తున్నారన్న దానిపై ఓ సర్వే నివేదిక వెల్లడైంది. ‘టైమ్ యూజ్’ నిర్వహించిన ఆ సర్వే నివేదిక ప్రకారం.. వారానికి 65.4 పని గంటలతో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ భారత్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. అయినప్పటికీ ఇది సరిపోదని, వారానికి 78.6 గంటలు పనిచేయాలని ఇన్పోసిస్ నారాయణమూర్తి పేర్కొన్నారు. గత 30 ఏండ్లలో గణనీయ పురోగతి సాధించిన దేశాలతో పోటీపడాలంటే భారత యువత వారానికి కనీసం 70 గంటలైనా పనిచేయాల్సిన అవసరమున్నదని స్పష్టం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు, జపనీయులు ఇదే చేశారని గుర్తుచేశారు. కాగా, నారాయణమూర్తి అభిప్రాయంతో పలువురు నెటిజన్లు విభేదిస్తున్నారు. ‘మన దేశంలో జీవితం ఎంత కఠినంగా ఉంటుందో, ప్రయాణాలకు ఎంత సమయం పడుతున్నదో ఆయనకు తెలుసా? కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు ఉద్యోగులు అర్హులు కాదా?’ అని ప్రశ్నిస్తున్నారు.
టైమ్ యూజ్ సర్వే నివేదిక ప్రకారం..

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

