Police Kistaiah | కరీంనగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య.. తన కూతురు ప్రియాంకను డాక్టర్‌ను చేయాలని కలలు కనేవాడు. కిష్టయ్య అమరత్వంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి కుటుంబపోషణే భారమైంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుని అండగా నిలిచారు. ముఖ్యమం త్రి ప్రో త్సాహంతో ప్రియాంక వైద్యవిద్యను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసి.. బస్తీ దవాఖానలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఇంతటితో సంతృప్తి చెందక.. మెడిసిన్‌లో పీజీ చదవి గైనకాలిజిస్టుగానో.. జనరల్ సర్జన్గానో సేవలందించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కలిసినప్పుడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. మెడిసిన్‌లో పీజీ చదవడానికయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే.. నీట్లో పీజీ ఎంట్రెన్స్‌లో బీ క్యాటగిరీ మేనేజ్మెంట్ కోటాలో జనరల్ సర్జన్ సీటు సంపాదించారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం.. శనివారం ఆమె ఫీజు రూ.24 లక్షలు చెల్లించారు. ఈ మేరకు కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో మెడిసిన్ పీజీలో అడ్మిషన్ తీసుకున్నారు. దీంతో తమ కుటుంబానికి సీఎం కేసీఆర్ చేసిన మేలు ఎప్పటికీ మరువలేమంటూ డాక్టర్ ప్రియాంక, కిష్ట య్య భార్య పద్మావతి సంతోషం వ్యక్తం చేశారు. ‘నన్ను డాక్టర్‌ను చేయాలని మా నా న్న కన్న కలను సీఎం కేసీఆర్ సార్ నెరవేర్చారు. ఇప్పుడు పీజీ కూడా చదివిస్తున్నా రు. మా నాన్న ఆత్మహత్య చేసుకున్న తర్వా త కేసీఆర్ సార్ మా కుటుంబానికి పెద్ద దిక్కులా ఉన్నారు. హైదరాబాద్‌లో అమరజ్యోతి ఆవిష్కరణ రోజు సీఎం సార్‌ను కలి సి పీజీ చదవాలన్న విషయాన్ని చెప్పాను. సీటు సంపాదించుకో తప్పక చదివిస్తానని హామీ ఇచ్చారు. సీటు వచ్చింది. కేసీఆర్ సార్ ఫీజు చెల్లించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో నాకు సహకరించిన ఎంపీ సంతోష్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు’ అంటూ ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు.