SCR | సికింద్రాబాద్ డివిజన్లో మరమ్మత్తులు.. ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు. కాజీపేట-డోర్నకల్, భద్రాచలం రోడ్-విజయవాడ, డోర్నకల్-కాజీపేట, విజయవాడ-భద్రాచలం రోడ్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, సిర్పూర్ టౌన్-కరీంనగర్ రైళ్లను రద్దు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రైళ్లను రద్దుచేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని విజవాయడ (Vijayawada) రైల్వే డివిజన్ పరిధిలో కూడా పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం రైలును ఈ నెల 5 నుంచి 10 వరకు, విశాఖపట్నం-గుంటూరు రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేశారు. ఇక గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్, మచిలీపట్నం-విశాఖపట్నం, విశాఖపట్నం-లింగంపల్లి రైళ్లను ఈ నెల 9 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం, రాయగడ-గుంటూరు, విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ రైళ్లను ఈ నెల 10వ తేదీ వరకు రద్దుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

