హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ (ఎఫ్సీఆర్ఐ) సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2023 ఫారెస్ట్ కాలేజ్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ షాలినికి దక్కింది. లక్నోలో ఎన్బీఆర్ఐలో సోమవారం జరిగిన జీపీసీసీ-2023 వాల్డిక్టరీ ఫంక్షన్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. మౌఖిక ప్రదర్శనలో ద్వితీయ బహుమతిని కూడా ఆమె పొందారు.
ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత అభిజత్ చేతులమీదుగా షాలిని సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. అవార్డు సాధించిన షాలినిని ఎఫ్సీఆర్ఐ అధికారులు, సిబ్బంది అభినందించారు.