Schools Reopen | స్కూల్ బస్సుల్లో ఈ నిబంధనలు పాటించాల్సిందే.. లేదంటే..
Schools Reopen | సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతుండటంతో పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సులను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యారు.
Schools Reopen | సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతుండటంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సులను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకనుగుణంగా లేని బస్సులను సీజ్ చేయనున్నారు. ఫిట్నెస్ లేని బస్సులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. గ్రేటర్లో పలు విద్యాసంస్థలకు చెందిన 12 వేల బస్సులు ఉండగా ఇందులో 1492 వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని అధికారులు గుర్తించారు.

ఈ నిబంధనలు తప్పనిసరి..
- మోటారు వాహన చట్టం ప్రకారం రిజిస్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, పన్ను చెల్లింపు రసీదు, పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్తో పాటు డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవర్ ఫొటోను తప్పనిసరిగా బస్సులో ఏర్పాటు చేయాలి. అద్దాలకు గ్రిడ్ అమర్చాలి. చిన్నారులు ఎక్కేందుకు మెట్లు కిందవరకు ఏర్పాటు చేయాలి.
- డ్రైవర్‌కు ఐదేండ్ల అనుభవం ఉండాలి. 60 ఏండ్ల వయసు మించకుండా చూసుకోవాలి. తప్పక కంటి పరీక్షలు జరిపించాలి.
- బస్సు డ్రైవర్‌కు స్కూల్ యాజామాన్యం హెల్త్‌కార్డు ఇప్పించి.. ప్రతి మూడు నెలలకోసారి వైద్యపరీక్షలు చేయించాలి.
- డ్రైవర్ లైసెన్స్‌ను స్కూల్ యాజమాన్యం తప్పక తనిఖీ చేయాలి.
- డ్రైవర్ వివరాలను పేరెంట్స్ కమిటీకి అప్పగించాలి.
- సురక్షిత ప్రయాణం కోసం అటు డ్రైవర్‌కు.. ఇటు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.

- ప్రతి బస్సులో విద్యార్థులకు అటెండెన్స్ తీసుకోవాలి.
- పది బస్సులకు ఒక అదనపు బస్సును ఏర్పాటు చేసుకోవాలి.
- ప్రతి బస్సుకు ఎడమ వైపు, వెనుక స్కూల్ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్లు రాయాలి.
- ప్రతి నెల స్కూల్ ప్రిన్సిపాల్, పేరేంట్స్ కమిటీ తప్పనిసరిగా బస్సులను తనిఖీ చేయాలి.
- బస్సు నిర్వహణపై రిజిస్ట్రర్ ఏర్పాటు చేయాలి.
- డ్రైవర్ వద్ద ఫిర్యాదు పుస్తకం ఉండేలా పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
- బస్సుల్లో అత్యవసర ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, సైడ్ అద్దాలు ఉండేలా చూసుకోవాలి.
- పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదు.
- బస్సుకు సంబంధించి బ్యాటరీ, వైపర్స్, రెండువైపులా ఇండికేటర్లు పని చేసేలా చూసుకోవాలి.
- బస్సులకు తప్పక పసుపు రంగు వేయాలి.

అనుమతి లేని వాహనాలు రోడ్లపైకి రావద్దు..
విద్యాసంస్థలకు చెందిన బస్సులను నిబంధనలకు అనుగుణంగా నడిపించాలి. ఆర్సీ, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని బస్సుల్లో విద్యార్థులను ఎక్కించడానికి వీలు లేదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి బస్సులో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. బస్సులో ప్రతి విద్యార్థి మాస్క్ ధరించేలా సూచించాలి. ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి.
– పాండురంగ నాయక్, జేటీసీ హైదరాబాద్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

