పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి| ఆమె భర్త చనిపోయాడు. బతుకు భారం అయింది.

హైదరాబాద్ : ఆమె భర్త చనిపోయాడు. బతుకు భారం అయింది. ఉన్న ముగ్గురు చిన్న పిల్లల బాగోగులు చూసుకోలేని పేదరికం. మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు కరోనా మహమ్మారి వల్ల కుటుంబం కడుపునింపుకునే కాస్తా అదెరువు కూడా కరువైంది. ఫలితంగా బస్టాండ్లోనే ఎప్పుడో ఒకప్పుడు దొరికే అన్నం పొట్లం ఆ ముగ్గురు పిల్లల కడుపు నింపడానికే సరిపోవడం లేదు. తల్లికి ఉపవాసాలు తప్పడం లేదు. ఇది సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట మండలం ధాకూర్కి చెందిన పద్మ దైన్య స్థితి.
ఇది తెలుసుకున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరిగిపోయారు. కంటనీరు పెట్టారు. తల్లిహృదయం తల్లడిల్లింది. వెంటనే ఆ తల్లి, పిల్లలను చేరదీయాలని, అండగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాలు వచ్చిన వెంటనే హుటాహుటిన తరలిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పద్మ పరిస్థితిని చూసి చలించి పోయారు. వెంటనే ఆ పిల్లలను హక్కున చేర్చుకున్నారు. వారు బలహీనంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించారు.

కరోనా నెగెటివ్ రావడంతో వెంటనే చిన్న పిల్లల కోసం ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ ప్రత్యేక వాహనంలో ఆమె స్వగ్రామం జోగిపేట- డాకూర్ కు చేర్చారు. కావాల్సిన నిత్యావసర సరుకులు, పిల్లలకు ఇచ్చే అంగన్ వాడీ పోషకాహారం అందించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ తో మాట్లాడి ఆమె సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. అంగన్ వాడీ కేంద్ర పర్యవేక్షణలో వారికి కావాల్సిన సంరక్షణ చేపడుతున్నారు.
సరైన సమయంలో సరైన విధంగా స్పందించి చేయుతనందించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను, సర్పంచ్ ను మంత్రి అభినందించారు.

ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

