గుట్టలో సర్వహంగులతో వ్రత మండపం
యాదగిరీశుడి క్షేత్రంలో నిర్మించిన అధునాతన సత్యనారాయణ స్వామి వ్రత మండపం బుధవారం అందుబాటులోకి రానున్నది. కొండకింద ఉత్తర దిశలో నిర్మాణాలను వైటీడీఏ ఆధ్వ ర్యంలో చేపట్టారు.
- రెండు ప్రత్యేక హాళ్లు.. ఒక్కో హాలులో 250 వ్రత పీటలు
- కొండకింద 17.38 కోట్లతో 2.57 ఎకరాల్లో భవనం
- నేడు లాంఛనంగా ప్రారంభం
యాదాద్రి, అక్టోబర్ 25: యాదగిరీశుడి క్షేత్రంలో నిర్మించిన అధునాతన సత్యనారాయణ స్వామి వ్రత మండపం బుధవారం అందుబాటులోకి రానున్నది. కొండకింద ఉత్తర దిశలో నిర్మాణాలను వైటీడీఏ ఆధ్వ ర్యంలో చేపట్టారు. 2.57 ఎకరాల్లో రూ.17.38 కోట్లు వెచ్చించి నిర్మించారు. రోజుకు 12 వేల వ్రతాలు నిర్వహించేందుకు సర్వహంగులతో తీర్చిదిద్దారు. గురువారం నుంచి సత్యనారాయణ స్వామి వ్రతాలను ఈ మండపంలోనే నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. కొండకిందకు వచ్చే ఎగ్జిట్ ఫ్లైఓవర్ దిగువ భాగంలో దీన్ని నిర్మించారు. వ్రతాల కోసం రెండు హాళ్లను నిర్మించగా, ఒక్కో హాలులో 250 వ్రత పీటలు ఏర్పాటు చేశారు.
ఒక్కో వ్రత పీటంపై నాలుగు జంటలు వ్రతమాచరించవచ్చు. హాల్‌కు వెయ్యి చొప్పున రెండు హాళ్లలో కలిపి ఏకకాలంలో రెండు వేల వంది వ్రతాలు జరుపుకోవచ్చు. ఇలా రోజుకు ఆరు బ్యాచ్‌లుగా విభజించి మొత్తం 12 వేల వ్రతాలను నిర్వహించనున్నారు. సిబ్బంది గది, ఇంచార్జి గది, అర్చక గది, టికెట్ కౌంటర్, పురుషులు, స్త్రీలకు ప్రత్యేక డ్రెసింగ్ రూమ్‌లు, పూజా సామగ్రి భద్రపరిచే గది, కొబ్బరికాయ కొట్టే ప్రాంతం, వ్రత పీటలు భద్రపరిచే గది, పురుషులకు 9, స్త్రీలకు 11 ప్రత్యేక టాయిలెట్స్ నిర్మించారు. వికలాంగులు, అర్చకులకు ప్రత్యేకంగా టాయిలెట్స్, అర్చకులు పూజలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన స్టేజీ నిర్మించారు.
గుట్టలో నేడు సామూహిక కార్తీక దీపోత్సవం
కార్తీకమాసం సందర్భంగా యాదగిరిగుట్టలో బుధవారం సామూహిక కార్తీక దీపోత్సవాన్ని అత్యం త వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల నుంచి దీపారాధన ఉత్సవాలను ప్రారంభిస్తామని ఆలయ ఈవో ఎన్ గీత, ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. భక్తులంతా దీపోత్సవంలో పాల్గొని జ్యోతిర్కాంతిలో నారసింహుడిని దర్శించుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

