హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్(Joginipally Santosh Kumar) తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి(Erravalli) గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో( Green India Challenge) పాల్గొని బాదం, సీతాఫలం మొక్కలు నాటార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టిన రోజులతో పాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాలన్నారు. పర్యావరణ పరిరక్షణపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ, మాజీ సివిల్ సప్లయ్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Green