విపక్ష నేతకు ఇల్లు మంజూరు
ప్రతిపక్ష నాయకుడి ఇంటి పరిస్థితిని చూసి చలించిపోయి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి. వారి ఇల్లు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
- భర్త ఎర్రజెండా, కొడుకు కాంగ్రెస్ పార్టీ
- పురాతన ఇంట్లో జీవనం
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో గోడు వెల్లబోసుకున్న సంతోషమ్మ
- ఇల్లు మంజూరుకు ఎమ్మెల్యే భరోసా
దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), జూలై 21: ప్రతిపక్ష నాయకుడి ఇంటి పరిస్థితిని చూసి చలించిపోయి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి. వారి ఇల్లు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వివరాలు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో పెంటన్న అనే వ్యక్తి వామపక్ష పార్టీలో తిరుగుతుండగా.. ఆయన కొడుకు ప్రిన్స్ కాంగ్రెస్ కార్యకర్త. అయితే వారు పురాతన ఇంట్లో బిక్కుబిక్కుమని కుటుంబ సభ్యులతో కలిసి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఇద్దరు చెరో పార్టీలో పనిచేస్తున్నా సదరు పార్టీలు వారి బాగోగులు పట్టించుకోలేవు. పైగా వీరికి ఇంటి మీద ధ్యాసే లేదు.
శుక్రవారం గ్రామ పర్యటకు వచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని పెంటన్న భార్య సంతోషమ్మ కలిసి తమ గోడు వెల్లబోసుకున్నది. ‘సారూ.. మాది పాతబడిన మట్టిల్లు. నా భర్త, కొడుకు తలో పార్టీలో తిరుగుతున్నారు. మిమ్మల్ని సాయం అడగడానికి ధైర్యం చాలడంలేదు.. కానీ, మాపై దయచూపి ఇల్లు మంజూరు చేయండి’ అంటూ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆల తాము పార్టీలకతీతంగా అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. తప్పకుండా ఇల్లు మంజూరు చేయిస్తానని మాట ఇచ్చారు. దీంతో ఆ ఇల్లాలి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇల్లు మంజూరు హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

