మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 22: మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన 11 మంది మద్యంప్రియులకు మూడురోజులపాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంచిర్యాల కోర్టు జడ్జి (ఫస్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్) ఉషనిషధ్వని శనివారం శిక్ష విధించారు. ఆదివారం మందమర్రి పోలీసులు వారితో మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించారు.