డీ సిల్టింగ్ పేరుతో ఇసుక మాఫియా కుట్రలు
గోదావరి నది భూగర్భ జలాల ధ్వంసం కోసమే ఇసుక మాఫీయా డీ సిల్టింగ్ పేరుతో కుట్రలు పన్నుతున్నదని, గిరిజన సొసైటీలపై ఆధిపత్యం చెలాయించాలని చూసే అధికార పార్టీ నేతలపై పోరాటం తప్పదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
- నిబంధలనకు విరుద్ధంగా భారీ ఎత్తున తవ్వకాలు
- తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్
ఏటూరునాగారం, జూన్ 22 : గోదావరి నది భూగర్భ జలాల ధ్వంసం కోసమే ఇసుక మాఫీయా డీ సిల్టింగ్ పేరుతో కుట్రలు పన్నుతున్నదని, గిరిజన సొసైటీలపై ఆధిపత్యం చెలాయించాలని చూసే అధికార పార్టీ నేతలపై పోరాటం తప్పదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇసుక లారీలు అర్ధరాత్రి విచ్చలవిడిగా నడుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎక్కడో కట్టే సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ స్టోరేజ్ ఏటూరునాగారం వరకు విస్తరించి ఉంటుందని తప్పుడు నివేదికలు సమర్పించి డీసిల్టింగ్ పేరుతో కొత్త క్వారీలకు అనుమతి ఇచ్చి వనరులు ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్ల ప్రలోభాలకులోనై పర్యావరణ, భూగర్భ శాఖ అధికారులు వినాశన అనుమతులు మంజూరు చేశారని మండిపడ్డారు. సొసైటీ యాక్టు ప్రకా రం కూలీలతోనే తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా రోడ్డుపైకి చేర్చాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా యంత్రా లు గోదావరిలోకి వెళ్లి లారీల్లో నింపుతున్నాయని ఆరోపించారు. మాఫియా ఆగడాలపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ చేపడుతామని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

