Vemulawada | వేములవాడలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. మైనింగ్ అధికారులపైనే దాడులు!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అనుమతుల పేరిట మూలవాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం దాటినా రవాణా చేస్తున్నది. ట్రాక్టర్ల డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్‌తో పట్టణ జనం బెంబేలెత్తుతున్నది.
వేములవాడ, జూన్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అనుమతుల పేరిట మూలవాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం దాటినా రవాణా చేస్తున్నది. ట్రాక్టర్ల డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్‌తో పట్టణ జనం బెంబేలెత్తుతున్నది. తనిఖీలకు వచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నది. ఇదే తరహాలో శనివారం మైనింగ్ అధికారిపై స్థానిక భీమేశ్వర గార్డెన్స్ వద్ద అందరూ చూస్తుండగానే ట్రాక్టర్ డ్రైవర్ దాడి చేసిన ఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది.
ఒకే ట్రిప్పునకు అనుమతి..
వేములవాడ మూల వాగు నుంచి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వ, స్థానిక అవసరాలకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే పర్యవేక్షణ కొరవడటంతో అక్రమ దందాకు తెరలేపారు. కేవలం రూ.300 డీడీ చెల్లించి ఒక ట్రిప్పును మాత్రం తీసుకెళ్లాల్సి ఉండగా ఒకే దానిపై మూడు, నాలుగు ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పలువురు ఫిర్యాదు చేయడంతో శనివారం సిరిసిల్ల జిల్లా మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, ఆర్ఐ సైదులు తనిఖీ నిర్వహించారు. కోరుట్ల వైపు వేగంగా వెళ్తున్న ఓ ఇసుక ట్రాక్టర్‌ను భీమేశ్వర గార్డెన్ వద్ద ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ వాహనం దిగి అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు. తిట్ల దండకం అందుకున్నాడు. రేపు మళ్లీ ఎట్లా తనిఖీలకు వస్తారో చూస్తామంటూ బెదిరిస్తూ గల్లాపట్టుకొని దాడికి యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

