అమీర్‌పేట్, ఆగస్టు 7: ఈఎస్ఐసీ దవాఖానల్లో మొట్టమొదటి అవయవదానం జరిగిన హాస్పిటల్‌గా దేశంలోనే సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఖ్యాతి గడించింది. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఏ నర్సింగ్‌ను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం సనత్‌నగర్ ఈఎస్ఐసీకి తీసుకొచ్చా రు. చికిత్స పొందుతూ నర్సింగ్ రెం డ్రోజుల క్రితం బ్రెయిన్‌డెడ్ అయిన ట్టు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబసభ్యుల అంగీకారం మేరకు జీవన్దా న్ బృందం ప్రతినిధులు నర్సింగ్ నుంచి రెండు కిడ్నీలు, కాలేయాన్ని స్వీకరించారు. ఓ కిడ్నీ, కాలేయాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించ గా, మరో కిడ్నీని ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో మహిళకి అమర్చారు.కార్యక్రమంలో సర్జన్ల బృందం డాక్టర్ సందీ ప్, డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పాండురంగరావు, డాక్టర్ నాగార్జున, డాక్టర్ ధనలక్ష్మి పాల్గొన్నారు.
విజిలెన్స్ నివేదికల్లో జాప్యం తగదు
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : విజిలెన్స్ నివేదిక రూప కల్పనలో జాప్యం లేకుండా అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సీవీ ఆనంద్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయం లో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కొత్త లోగోను ఆవిష్కరించారు. అనంతరం అన్ని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ల(ఆర్వీఈవో)పనితీరును సమీక్షించారు. ఆర్వీఈవో యూనిట్ల అధికార పరిధిపై చర్చించారు. డిఫాల్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆన్లైన్లో ఓడీ, డిప్యూటేషన్ దరఖాస్తులు
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని టీచర్లు, లెక్చరర్లు ఇకపై ఆన్‌డ్యూటీ(ఓడీ), డిప్యూటేషన్, స్పెషల్ బదిలీల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రత్యేక ఆన్లైన్ వ్యవస్థను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకురానున్నది. దరఖాస్తుల స్వీకరణకు ఈజీ యాప్, వెబ్‌పోర్టల్ ను ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెల్(ఎన్ఐసీ)ద్వారా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఓడీ, డిప్యూటేషన్ల మంజూరుకు ఇటీవలే ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతి సంవత్సరం మే, ఆగస్టు, నవంబర్ మొదటి వారా ల్లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నది. నిబంధనల మేరకు వారికి రెండేండ్లు మించకుండా ఓడీ, డిప్యూటేషన్‌కు అవకాశం కల్పించనున్నారు.
ధాన్యం కొనుగోలుకు 17 మందితో కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు నిబంధనల్లో మార్పులను సిఫారసు చేసేందుకు 17మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసరఫరాలశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రియాంకతోపాటు అదేశాఖ నుంచి మరో 11మంది, కార్పొరేషన్ నుంచి ఐదుగురు సభ్యులను నియమించింది.
ఉపాధి హామీ ఉద్యోగులకు బదిలీలు
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీ చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్(ఎఫ్‌టీఈ)ను బదిలీలు చేయాలని నిర్ణయించింది. నాలుగేం డ్లు ఒకే దగ్గర పనిచేసిన వారి వివరాలను పంపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ సోసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ మెంబర్ సెక్రటరీ రాజారావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.అర్హులైన వారి వివరాలు అందిన తరువాత బదిలీలు చేపట్టనున్నట్టుగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.
సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాల కమిటీ
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాల ఖరారుకు అధికారులతో కమిటీని నియమిస్తూ సెర్ప్ సీఈవో దివ్య రాజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో ఐదుగురు సెర్ప్ డైరెక్టర్లు సీహెచ్ గోపాల్ రావు, సూర్యారావు, నవీన్ కుమార్, కాళీకాంతి, సునీతతో కమిటీని వేశారు. ఈ కమిటీకి 8 మంది సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమించారు. ఈ కమిటీ సమావేశమై ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలను ఖరారు చేసి సీఈవోకు నివేదిక ఇవ్వనున్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బదిలీల మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు.