సుల్తానాబాద్, జూలై 26 : స్వాతంత్య్ర సమరయోధుడు కుర్మ వీరయ్య (105) కన్ను మూశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఉం టున్న వీరయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసి, నిజాంపై తిరుగుబాటు చేసి జైలు జీవితం గడిపిన వీరయ్య మృతికి పలువురు నివాళులర్పించారు. వీరయ్య పార్థివ దేహంపై సుల్తానాబాద్ తాసిల్దార్ యాకయ్య, స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలసాని వెంకటేశం తదితరులు జాతీయజెండా కప్పి నివాళులర్పించారు.