హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)లకు గత 7 నెలల నుంచి జీతాలు నిలిచిపోయాయి. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా వేతనాలు విడుదల చేయడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాకు దిగారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, కనీస గౌరవ వేతనాన్ని రూ.20 వేలకు పెంచాలని, పీఆర్సీని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆర్పీల డిమాండ్లు ఇవీ..