హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (టీఎంటీ), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ సహా 32 కేంద్రాల్లో ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్టు ఆయన పేరొన్నారు.
టీఎంటీ పోస్టుల కోసం 20,128 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా, 15,796 (78.48%) మంది హాజరయ్యారని శ్రీనివాసరావు తెలిపారు. ఎంఎస్టీ పరీక్షకు 5,865 మందికి 4,817 (82.13 %) మంది అభ్యర్థులు హాజరైనట్టు వెల్లడించారు. ఈ పరీక్షల ప్రాథమిక కీ’లను కొద్దిరోజుల్లోనే www.tgprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.