కేసీఆర్ హయాంలోనే సన్నబియ్యం
కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు సూచించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేతలు సన్నబియ్యం పంపడంపై ఆయన మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
- తామే మొదలుపెట్టినట్టు కాంగ్రెస్ నేతల గప్పాలు
- హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలి
- బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్ రావు
హైదరాబాద్, జులై 25 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు సూచించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేతలు సన్నబియ్యం పంపడంపై ఆయన మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు సన్నబియ్యంపై డ్రామాలు కట్టిపెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు ఇస్తామన్న బోనస్ ఏదని ప్రశ్నించారు.
ఉచితంగా ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పుడు రూ. 6లక్షలు కట్టాలని పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను కాంగ్రెస్ పూర్తిగా మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందని విమర్శించారు. ప్రభుత్వ మోసాలను ఎత్తిచూపుతూ త్వరలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసనకు దిగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో, గ్యారెంటీ కార్డులు, డిక్లరేషన్లను రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు కొరియర్ ద్వారా పంపించనున్నట్టు తెలిపారు. వాటిని ఎందుకు ఎగ్గొట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్, పల్లయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | ఆధార్‌కు బదులు ఓటర్ ఐడీ.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్ ఎసరు?
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

