RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveenkumar | ఇంజినీర్ ఉద్యోగాలని చెప్పి యువకులను జర్మనీకి పంపించి మటన్ షాపులో పని చేయిస్తున్నారు. TOMCOM పేరిట నిరుద్యోగుల నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి డబ్బులు వసూలు చేస్తున్నాడని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
RS Praveenkumar | కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న టామ్‌కామ్ స్కామ్ (TOMCOM) ను బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటపెట్టారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ టామ్‌కామ్ గురించి టామ్‌టామ్ చేస్తూ రోజూ మంత్రి వివేక్ వెంకటస్వామి తిరుగుతున్నారు. ఆయన దక్షిణ కొరియా పోతున్నారు.. జపాన్ పోయారు.. మొన్ననే జర్మనీ కూడా పోయొచ్చారు.. మరి జర్మనీకి వాళ్ల ఫ్రీగా అయితే పోరు.. ప్రభుత్వ ఖర్చుతో ప్రజల కష్టార్జితంతో మంత్రి, ఆయనతోపాటు కొంతమంది అధికారులు వైట్ పాస్పోర్టుతో ప్రభుత్వ ఖర్చుతో వీళ్లు విదేశాలకు పోయి వస్తారు.. దీనికి కోట్ల రూపాయలు ఖర్చై ఉంటయన్నారు.
ఈ టామ్ కామ్ సంగతేంటి.. వీళ్లకు జరిగిన బాధేందనేది తెలంగాణ ప్రజల ముందర ఏకరువు పెట్టాల్సిన సమయం ఆస్ననమైంది..తెలంగాణలో నిరుద్యోగులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ చూస్తూ మీకర్థమవుతుంది. గ్రాడ్యుయేషన్ లేకున్నా కూడా ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్లు 20 లక్షల వరకు ఉంది. ఏ ప్రభుత్వం కూడా అందరికీ అన్ని ఉద్యోగాలు కల్పించలేదు.
ఒక ఉద్యోగం అని చెప్పి మరో ఉద్యోగం ఇప్పించి..
ఇంజినీర్ ఉద్యోగాలని చెప్పి యువకులను జర్మనీకి పంపించి మటన్ షాపులో పని చేయిస్తున్నారు. TOMCOM పేరిట నిరుద్యోగుల నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో 2014లో TOMCOM ఏర్పాటు చేశారు. ఒక ఉద్యోగం అని చెప్పి మరో ఉద్యోగం ఇప్పించి బ్రోకర్లు అందరినీ మోసం చేస్తున్నారని, ఇవన్నీ జరగకూడదనే గత ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసిందన్నారు.
జర్మనీలో ఉద్యోగాలు, వాటికి కావాల్సిన నైపుణ్యాల గురించి TOMCOM ఇటీవల ప్రకటనలు ఇచ్చింది. ప్రకటనలు రాగానే వందలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఉచితంగా కల్పించాల్సిన అవకాశాల కోసం ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.4.10 లక్షలు వసూలు చేశారు. ఈ నిరుద్యోగులతో TOMCOM పేరు లేకుండా Fair Street అనే సంస్థ పేరు మీద ఉన్న అగ్రిమెంట్లపై సంతకాలు చేయించారు. 200 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కనీసం 10 మందిని కూడా జర్మనీకి పంపించలేదని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక నిరుద్యోగ యువకుడికి మెకాట్రానిక్స్ విభాగంలో ఉద్యోగం అని చెప్పి జర్మనీకి పంపించారు.. కానీ అక్కడికి వెళ్లాక బీఫ్, మటన్, ఇతర మాంసం కట్ చేయాలని అతని చేతికి కత్తి ఇచ్చారు
అక్కడికి వెళ్లిన యువకులందరిదీ ఇదే పరిస్థితి. వివేక్ వెంకటస్వామి తన కొడుకు గడ్డం వంశీకృష్ణను కూడా ఇలాగే పంపిస్తాడా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో స్కామ్‌ను బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఇంజినీర్ ఉద్యోగాలని చెప్పి యువకులను జర్మనీకి పంపించి మటన్ షాపులో పని చేయిస్తున్నారు
TOMCOM పేరిట నిరుద్యోగుల నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి డబ్బులు వసూలు చేస్తున్నాడు
నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో 2014లో TOMCOM ఏర్పాటు చేశారు
ఒక ఉద్యోగం అని చెప్పి మరో ఉద్యోగం ఇప్పించి బ్రోకర్లు అందరినీ మోసం చేస్తున్నారని, ఇవన్నీ జరగకూడదనే గత ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసింది
జర్మనీలో ఉద్యోగాలు, వాటికి కావాల్సిన నైపుణ్యాల గురించి TOMCOM ఇటీవల ప్రకటనలు ఇచ్చింది
ప్రకటనలు రాగానే వందలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు
ఉచితంగా కల్పించాల్సిన అవకాశాల కోసం ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.4.10 లక్షలు వసూలు చేశారు
ఈ నిరుద్యోగులతో TOMCOM పేరు లేకుండా Fair Street అనే సంస్థ పేరు మీద ఉన్న అగ్రిమెంట్లపై సంతకాలు చేయించారు
200 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కనీసం 10 మందిని కూడా జర్మనీకి పంపించలేదు
ఒక నిరుద్యోగ యువకుడికి మెకాట్రానిక్స్ విభాగంలో ఉద్యోగం అని చెప్పి జర్మనీకి పంపించారు
కానీ అక్కడికి వెళ్లాక బీఫ్, మటన్, ఇతర మాంసం కట్ చేయాలని అతని చేతికి కత్తి ఇచ్చారు
అక్కడికి వెళ్లిన యువకులందరిదీ ఇదే పరిస్థితి
వివేక్ వెంకటస్వామి తన కొడుకు గడ్డం వంశీకృష్ణను కూడా ఇలాగే పంపిస్తాడా?
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
‘నగర పారిశుధ్యానికి శ్రమించే కార్మికుల ఆరోగ్యమే ముఖ్యం’
Vaibhav Sooryavanshi: చలినీళ్లు తాగకు.. సూర్యవంశీకి అభిమాని సలహా.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

