RS Praveen Kumar | సరూర్ నగర్ సభకు బయల్దేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. పోలీసులు ఇంకా వెంబడిస్తున్నారని వీడియో
RS Praveen Kumar | ఎట్టకేలకు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బయల్దేరారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం.. హౌస్ అరెస్టు నుంచి బయటపడి సభకు బయల్దేరినట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు
RS Praveen Kumar | ఎట్టకేలకు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బయల్దేరారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం.. హౌస్ అరెస్టు నుంచి బయటపడి సభకు బయల్దేరినట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ తనను నార్సింగి పోలీసులు వెంబడిస్తూనే ఉన్నారని ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.
యువతకు రెండు లక్షల ఉద్యోగాలిస్తామని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సును తలపెట్టింది. ఈ సభకు హైకోర్టు, మల్కాజిగిరి సీపీ సుమతి అనుమతి ఉన్నప్పటికీ.. సభకు వెళ్లకుండా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉందని అన్నారు. మా ప్రాథమిక హక్కులను కాలరాసేలా అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.
పోలీసుల నిర్భందపు వలయాన్ని దాటి నేను సరూర్ నగర్ సభకు వస్తున్న. నన్ను నార్సింగి పోలీసులు ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం, @revanth_anumula. pic.twitter.com/bUI6DtK0cN
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 18, 2026
ఓ వైపు సంవిధాన్ బచావో అంటూనే, మరోవైపు హక్కులను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తోందని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తుందని అన్నారు. మళ్లీ సిగ్గులేకుండా ప్రజాపాలన అంటున్నారని మండిపడ్డారు.ఆది నుంచి బీఆర్ఎస్ సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారని సీఎం, హోంమంత్రి రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెన్ని అడ్డంకులు సృష్టించినా సభకు
అయితే పోలీసులతో వాగ్వాదం అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను నిర్బంధం నుంచి వదిలేశారు. దీంతో ఆయన సరూర్ నగర్ సభకు బయల్దేరారు. అయినప్పటికీ ఆయన్ను మళ్లీ అడ్డుకోవడానికి నార్సింగి పోలీసులు వెంటపడటంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనను ఎక్కడైనా అడ్డుకుంటే.. అక్కడే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

