హైదరాబాద్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో (Falaknuma Express) అధికారులు తనిఖీలు చేపట్టారు. హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్కేసర్ వద్ద రైలును అపిన ప్రత్యేక బృందాలు.. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్కేసర్ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారు అరగంట నుంచి రైలులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు ప్రతిఒక్కరిని సరైన ధృవపత్రాలు చూపించాలని కోరుతున్నారు.