హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేయాలని, దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో బుధవారం న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఎదుట బీజేపీ తరఫు వాదనలు పూర్తయ్యాయి. సీఆర్ పీసీ 164 సెక్షన్ కింద రోహిత్‌రెడ్డి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట సిట్ నమోదు చేయించడాన్ని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్ ఆక్షేపించారు. గురువారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు జరుగనున్నాయి.