మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 18:59:34

జగిత్యాల జిల్లాలో రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి

జగిత్యాల జిల్లాలో రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి

హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్ రావుకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని సుమారు 41 కిలోమీటర్ల మేర రోడ్లు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని మంత్రి వివరించారు.

దెబ్బతిన్న రోడ్ల మూలంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటి మరమ్మతులను సత్వరమే చేపట్టాల్సిన అవసరం గురించి ఇంజనీర్ ఇన్ చీఫ్ తో బుధవారం మంత్రి చర్చించారు. మరమ్మతుల కోసం సుమారు 16కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇంజనీర్ ఇన్ చీఫ్ కు మంత్రి అందజేశారు. తక్షణమే తగు చర్యలు తీసుకుంటానని వీందర్ రావు మంత్రికి హామీనిచ్చారు.


logo