పకడ్బందీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను రాష్ట్రంలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఇండ్ల వద్దకు వెళ్లి విధులు నిర్వహించే బూత్‌లెవల్ అధికారులు(బీఎల్వోలు), బీఎల్వో సూపర్వైజర్లకు తగిన భద్రత, పూర్తి సహకారం అందించాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అకడ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు.
- రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి షురూ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను రాష్ట్రంలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఇండ్ల వద్దకు వెళ్లి విధులు నిర్వహించే బూత్‌లెవల్ అధికారులు(బీఎల్వోలు), బీఎల్వో సూపర్వైజర్లకు తగిన భద్రత, పూర్తి సహకారం అందించాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అకడ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ‘సర్’ కార్యక్రమ నిర్వహణ, భద్రతా ఏ ర్పాట్లపై సోమవారం బీఆర్కే భవన్‌లోని సీఈవో కార్యాలయం నుంచి అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీస్ కమిషనర్(లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి సీఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఈవో మాట్లాడుతూ.. రా ష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపట్టే ఈ కీలక ప్రక్రియకు పోలీస్ శాఖ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, జీహెచ్ఎంసీ కమిషనర్, ఆయా జిల్లాల పోలీస్ కమిషనర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

