హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 4 నుంచి 6 సాయంత్రం 5 గంటల వరకు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకోవాలని సూచించారు. సందేహాలుంటే 040 23542185, 23542187 లేదా helpdesk@tspsc.gov.in మెయిల్‌ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 22న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.