Minister Ponguleti | రాష్ట్రంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Minister Ponguleti | : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాల అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం (Revenue Staff) పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas reddy) జిల్లాల అధికారులను ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ విభాగంలో అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు (Leaves Cancell) చేయాలని ఆదేశాలు వెల్లడించారు.
భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణను ఆదేశించారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి ఉధృతి, వరద పరిస్థితులపై ఆయా జిల్లా కలెక్టర్లతో టెలిఫోన్ లో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంపై గోదావరీ (Godavari ) పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వరద ముప్పు ప్రాంతాలలో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు.
అధిక వర్షాలు కురుస్తున్న ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యలను వివరించారు. విద్యుత్తు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

