హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఆదివారం అక్కడి ప్రముఖ పారిశ్రామిక నగరమైన కితాక్యూషూను సందర్శించింది. ఈ సందర్భంగా వారు కితాక్యూషూ మేయర్ కజుహిసా టకేచీతో భేటీ అయ్యారు. వారికి అకడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు పలువురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్య నగరమైన కితాక్యూషూ ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతోపాటు జపాన్‌లో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా ఎదిగింది.