రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య రగులుతున్న రాజకీయ వైరం రేడియల్ రోడ్డు టెండర్ల సాక్షిగా పతాక స్థాయికి చేరింది. మంత్రి పదవి దకలేదన్న అసంతృప్తితో మొదలైన విభేదాలు వ్యాపార కాంట్రాక్టుల కేటాయింపులపై ప్రభావం చూపే స్థాయికి చేరాయి.
- రేడియల్ రోడ్డు టెండర్లపై కోర్టుకు
- మంత్రి పదవిపై ముదిరిన విభేదాలు
- టెండర్ ప్రక్రియ నుంచి సుశీ ఇన్ ఫ్రాను తప్పించడంపై అసంతృప్తి
- న్యాయపోరాటంతో ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన ఎమ్మెల్యే
- రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహంపై తెలంగాణ హైకోర్టు అభ్యంతరం
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య రగులుతున్న రాజకీయ వైరం రేడియల్ రోడ్డు టెండర్ల సాక్షిగా పతాక స్థాయికి చేరింది. మంత్రి పదవి దకలేదన్న అసంతృప్తితో మొదలైన విభేదాలు వ్యాపార కాంట్రాక్టుల కేటాయింపులపై ప్రభావం చూపే స్థాయికి చేరాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను తుంగలో తొకి తమ సంస్థను పకనపెట్టిందని ఆరోపిస్తూ.. రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీ సొంత పార్టీ సరార్పైనే హైకోర్టులో యుద్ధం ప్రకటించింది. మంత్రివర్గ విస్తరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరితో రాజగోపాల్‌రెడ్డి బాహాటంగానే విభేదిస్తూ వస్తున్నారు.
తనను రాజకీయంగా అణచివేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రాజెక్టుల టెండర్లను కూడా దక్కకుండా చేసి వ్యాపారపరంగా అణచివేసే కుట్ర చేస్తున్నారని కోమటిరెడ్డి వర్గం భావిస్తున్నది. రాజగోపాల్‌రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్‌రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌ను అత్యంత వ్యూహాత్మకంగా టెండర్ ప్రక్రియ నుంచి గెంటివేశారని కోమటిరెడ్డి వర్గం ఆరోపిస్తున్నది. తమ వ్యాపార మూలాలపై దెబ్బకొట్టేందుకే ప్రభుత్వ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిందన్న భావనతో, ఈ వ్యవహారాన్ని న్యాయపోరాటం ద్వారానే తేల్చుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోర్టును ఆశ్రయించినట్టు చెప్తున్నారు.
అనుభవ ధ్రువీకరణ పేరుతో అనర్హత వేటు
కొత్వాల్‌గూడ (బుద్వేల్ ) ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి నాచారం సమీపంలోని జాతీయ రహదారి-167ఎన్ వరకు 81.15 కిలోమీటర్ల మేర రేడియల్ రోడ్డు-2 నిర్మాణానికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. బుద్వేల్ -షాబాద్ మధ్య 29.50, షాబాద్ -గూడూరు మధ్య 27, గూడూరు-నాచారం మధ్య 24.65 కిలోమీటర్ల సాగే ఈ ప్రాజెక్టు బిడ్డింగ్‌లో సుశీ ఇన్ఫ్రా పాల్గొన్నది. అక్టోబర్ 7న ప్రకటించిన సాంకేతిక బిడ్ ఫలితాల్లో ఈ సంస్థను అనర్హమైనదిగా అధికారులు తోసిపుచ్చారు. అనుభవ ధ్రువీకరణ పత్రంపై ఎస్ఈ కౌంటర్ సంతకం లేదనే సాంకేతిక కారణాన్ని తెరపైకి తెచ్చి సంస్థ బిడ్‌ను తిరసరించడం రాజకీయ కుట్రలో భాగమేనని సుశీ ఇన్ఫ్రా ఆరోపించింది.
ప్రభుత్వ అత్యుత్సాహంపై అభ్యంతరం
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుశీ ఇన్ఫ్రా దాఖలు చేసిన మూడు పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖకు చెందిన ఈఈ సర్టిఫికెట్ జారీచేశారని, ఆయనకు ఎస్ఈ హోదా కూడా ఉన్నందున, ఆయన ధ్రువీకరణను పరిశీలించకుండానే కాంట్రాక్టు తిరసరించడం అన్యాయమని పేరొన్నారు. పత్రాల్లో లోపాలు ఉంటే వివరణ కోరాల్సి ఉంటుందని, కానీ అధికారులు తమకు అవకాశం ఇవ్వకుండానే ధరల బిడ్లను తెరిచి అవతలివారికి కట్టబెట్టే యత్నం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే సాంకేతిక, ధరల బిడ్ల ప్రక్రియ పూర్తయిందని, ఎల్-1 బిడ్డర్‌ను కూడా ఖరారు చేశామని కోర్టుకు వివరించారు.
హైకోర్టు కీలక ఆదేశాలు
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యవహారంలో కీలక ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్లు ఖరారైనంత మాత్రాన ప్రతివాదులకు ఎలాంటి ప్రత్యేక న్యాయపరమైన హకులు సంక్రమించవని స్పష్టంచేశారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. అర్హత ఉన్నప్పటికీ సీఎం కార్యాలయం పెద్దల కనుసన్నల్లోనే తమ సంస్థను కావాలని తప్పించారనే కోమటిరెడ్డి వర్గం ఆరోపణలకు, హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఆదేశాలు ఒకరకంగా రేవంత్ ప్రభుత్వ దూకుడుకు తాతాలిక బ్రేక్ వేసినట్లయింది. సీఎం టెండర్ల నిర్ణయాలను అదే పార్టీ ఎమ్మెల్యే కోర్టు ద్వారా అడ్డుకునే స్థాయికి వ్యవహారం చేరడం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఏ స్థాయికి చేరిందో అర్థం అవుతున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

