హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): ‘రాజకీయ దురంధరులను తొక్కుకుం టూ వచ్చిన’ అంటూ గొప్పగా చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి ఓ రాజకీయ పసికూన విసిరిన రాజకీయ పాచికకు విలవిల్లాడుతున్నారా? సుస్మిత పెట్టిన కుంపటితో పదవీ భయం పట్టుకున్నదా? ఆ దెబ్బతోనే తన విదేశీ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారా? రాష్ట్రంలో పరిస్థితి ‘చేయి’ దాటిపోతుండటం, అసలే సంక్షోభాలకు నెలవైన ఆగస్టు నెలలోనే ఇవన్నీ ఉలిక్కిపడేలా చేశాయా? అందుకే అమెరికా పర్యటనను రద్దు చేసుకొని హుటాహుటిన రాష్ర్టానికి బయలుదేరారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
సీఎం రేవంత్‌రెడ్డి తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఆ తర్వాత 24 నుంచి 30 వరకు అమెరికాలో పర్యటించాల్సి ఉన్నది. ఆ తర్వాత సెప్టెంబర్ 10 వరకు జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించాల్సి ఉన్నది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఈ నెల 23న రాష్ర్టానికి రానున్నారు. అయితే లండన్ తర్వాత అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన అమెరికా పర్యటనతో పాటు జర్మనీ, చైనా టూర్లను సైతం రద్దు చేసుకొని రాష్ర్టానికి వస్తున్నారు. వాస్తవానికి ఆయన సెప్టెంబర్ 10న రాష్ర్టానికి రావాల్సి ఉన్నది.
సీఎం రేవంత్‌కు పదవీ భయం పట్టుకున్నదనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జ రుగుతున్నది. అందుకే ఆయన అర్ధంతరంగా దేశీ పర్యటన రద్దు చేసుకొని.. హుటాహుటిన రాష్ర్టానికి వస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అన్ని వైపుల నుంచీ అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసేలా కొండా సుస్మిత వ్యాఖ్యలు మ రింత రచ్చ రేపాయి. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రెండు వర్గాలుగా వి డిపోయిన పరిస్థితి నెలకొన్నది. ఎలాగూ తెలు గు రాష్ర్టాల రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం ఆనవాయితీగా మారిన విషయం తెలిసిందే.
అది కూడా సీఎంలు విదేశీ పర్యటనల్లో ఉండగానే ఇక్కడ రాత్రికి రాత్రే ప్రభుత్వాలు మారిన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు అసంతృప్త జ్వాలలు, మరోవైపు పొంచిఉన్న ఆగస్టు సంక్షోభం.. దీంతో రేవంత్‌రెడ్డి గుండెల్లో గుబులు మొదలైందనే చర్చ జరుగుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను విదేశాల్లో ఉంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదని రేవంత్ గ్రహించారనే వాదనలున్నాయి. తన కుర్చీ కదలడం ఖాయమనే ఆందోళన ఆ యనలో ఉన్నట్టు తెలిసింది. అందుకే స్వ యంగా పర్యటనను రద్దు చేసుకొని రాష్ర్టానికి వస్తే ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖా యం. అందుకే తెరవెనుక తన గురువును శర ణు జొచ్చినట్టుగా తెలిసింది. అందుకే అమెరికా పర్యటనకు కేంద్రం నుంచి అనుమతులు రా కుండా చేసుకోగలిగారనే చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఓవైపు సీఎం రే వంత్‌రెడ్డి టార్గెట్‌గా అసమ్మతి స్వరాలు పెరుగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలతో వరుస వివాదాలు సర్కార్‌ను చుట్టుముట్టా యి. ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం, తెలంగాణతో సంబంధంలేనోళ్లు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని, పదవిని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రోళ్ల చెప్పుచేతుల్లో ప్రభుత్వం నడుస్తున్నదంటూ తీవ్ర వి మర్శలు గుప్పించారు.
ఇది మరువకముందే భారీ భూ దోపిడీకి ప్రభుత్వంలోని ఇద్దరు ముఖ్యులు కుట్ర చేశారనే ఆరోపణలున్నాయి. ఒక విధంగా 22ఏ నిషేధిత జాబితాతో రాష్ట్రంలో భూ సంక్షోభం ఏర్పడింది. పట్టా, ప్రైవేట్‌కు చెందిన కోట్ల ఎకరాలను నిషేధిత జాబితాలో వేశారు. ఇక తా జాగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత నేరుగా సీఎంనే టార్గెట్‌గా చేయడం సంచలనం రేపింది. ఒక విధంగా ఆమె వ్యాఖ్యలు పార్టీ, ప్రభుత్వంలో సంక్షోభానికి దారితీసే పరిస్థితులు ఏర్పడటం గమనార్హం. వరుస వివాదాలు, అసమ్మతి రాగంతో రాష్ట్రంలో రాజకీయ కల్లోలం ఏర్పడింది.
తనను తాను ఓ గొప్ప రాజకీయ దురంధరుడిగా గొప్పలు చెప్పుకొనే సీఎం రాజకీయ ఓనమాలు తెలియని పసికూన దెబ్బకు విలవిల్లాడుతున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. ఆమె వ్యాఖ్యలు రేవంత్ ఇమేజ్ను భారీగా డ్యామేజ్ చేశాయనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఎవరు కూడా నేరుగా ఆయనపై విమర్శలు చేసే ధైర్యం చేయలేదు. కానీ సుస్మిత ఆ ధైర్యం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనంటే భయం పోయేలా చేసిందనే చర్చ జరుగుతున్నది. ఇది కొద్ది కాలంలోనే తీవ్ర అసమ్మతికి దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదనే తెలుస్తున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటన రద్దుకు కేంద్ర విదేశాంగ శాఖ చెప్పిన కారణం ఈ అనుమానాలను మరింత పెంచుతున్నది. సీఎం స్థాయికి తగిన కార్యక్రమాలు లేవంటూ అ నుమతి ఇవ్వలేదని పేర్కొన్నది. పర్యటన రద్దు అయిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ర ద్దయ్యేలా చేసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్తున్నారంటే పక్కా ప్రణాళిక ఉంటుంది. వాస్తవ షెడ్యూల్‌ను దాచేసి రద్దు చేసుకునేలా సాధారణ షెడ్యూల్‌ను ఇచ్చారా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ కేంద్రం అనుమతి నిరాకరిస్తే అవసరమైన సమాచారం మళ్లీ ఇచ్చి ఎందుకు అనుమతుల కోసం ప్రయ త్నం చేయలేదు. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వదని? ఇందులో ఏదో ఉద్దేశపూర్వక తప్పిదాలు ఉ న్నాయనే అనుమానాలున్నాయి. ఇదిలా ఉంటే సీఎం షెడ్యూల్ ప్రకారం అమెరికా నుంచి జర్మనీ, ఆ తర్వాత చైనాకు వెళ్లాలి. కానీ ఆ దేశాల పర్యటనను సైతం సీఎం రద్దు చేసుకున్నట్టు తెలిసింది. కేంద్ర విదేశాంగ శాఖ ఒక్క అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోతే జర్మనీ, చైనా పర్యటనలను కూడా ఎందుకు రద్దు చేసుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.