భూ దోపిడీ కోసమే 22ఏ.. పట్టా భూములు నిషేధిత జాబితాలోకా?
భూములను దోచుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల
- కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో ధర్నా
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 3 : భూములను దోచుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. దాదాపు 115 ఏండ్లుగా ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు లేని భూములను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దోచుకోవాలనే ఉద్దేశంతోనే సదరు భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.
సర్కార్ తీరుతో పేదలు అరిగోస పడుతున్నారని ఆవేదన చెందారు. ఆపద, అత్యవసర సమయాల్లో, వివాహాది శుభకార్యాల కోసం భూములు అమ్ముకునే అవకాశం లేక నరకం చూస్తున్నారని అన్నారు. పట్టా భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఏదో చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతు వ్యతిరేకిగా మారిందని దుయ్యబట్టారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

