రేవంత్ పాలనలో రాష్ట్రం దివాలా.. కాగ్ రిపోర్ట్ సాక్షిగా 12,289 కోట్ల బడ్జెట్ లోటు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే రాష్ర్టాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ వి మర్శించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బూతు పురాణం ఆయుధంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే రాష్ర్టాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ వి మర్శించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బూతు పురాణం ఆయుధంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అబద్ధాల పుట్ట అని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసిందని పేర్కొన్నా రు. ప్రభుత్వం రూ.6,857 కోట్ల సర్ ప్లస్ (మిగులు) బడ్జెట్ అని రికార్డుల్లో చూపించిందని, కానీ, ఆరు నెలల్లోనే రూ.12,289 కోట్ల బడ్జెట్ లోటు వచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ రెవెన్యూ 22% మాత్రమే వచ్చిందని, జీఎస్టీ వసూళ్లు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎక్సైజ్ డ్యూటీ రెవెన్యూలోనూ 18% మాత్రమే ఆదాయం సమకూరిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. అడ్డగోలుగా రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని, ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఈ రెవెన్యూ లోటు ఏకంగా రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని హెచ్చరించారు. మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం పరిధిలోకి తీసుకునే నెపంతో రూ.12 వేల కోట్ల అప్పుల భారాన్ని అదనంగా ప్రజల నెత్తిన రుద్దారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వంత్‌రెడ్డి 75 సార్లు ఢిల్లీకి చకర్లు కొట్టినా కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధించుకొచ్చింది 5.7% గ్రాంట్లు మాత్రమేనని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

