సుబేదారి, మార్చి 26 : రిటైర్డ్ నిట్ ప్రొఫెసర్ సైబర్ నేరస్తుడి వలకు చిక్కి రూ.కోటి పోగొట్టుకున్నాడు. వరంగల్ పోలీసు కమిషనరేట్ సైబర్ విభాగం ఏసీపీ గిరికుమార్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన రిటైర్డ్ నిట్ ప్రొఫెసర్ తన స్మార్ట్ ఫోన్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. నిరుడు డిసెంబర్ 25 నుంచి ఫిబ్రవరి వరకు వివిధ దశల్లో రూ.కోటి రూపాయల వరకు వెచ్చించాడు.
చివరికి మోసపోయానని గుర్తించి, కుటుంబసభ్యులకు విషయం చెప్పగా ఆయన కుమారుడు సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్ 1930 కాల్ చేశాడు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు రిటైర్డ్ నిట్ ప్రొఫెసర్ సైబర్ నేరస్తుడి ఖాతాలోకి బదిలీ చేసిన ఖాతాను బ్లాక్ చేశారు. కోటి రూపాయల్లో రూ.30.86 లక్షలు డ్రా చేయకుండా అకౌంట్ ఫ్రీజ్ చేశారు.