కౌలు రైతులపై ప్రభుత్వానికి పట్టింపేది?
కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
- రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ నిలదీత
హైదరాబాద్ (ఖైరతాబాద్), జూలై 18: కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కౌలు రైతులు అప్పు చేసి పంట సాగు చేస్తున్నారు.
ఒకవేళ పంట దెబ్బతింటే ఏం చెయ్యాలో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకుంటున్నారు. సామాన్య రైతులకు అమలు చేస్తున్న పంట నష్టపరిహారాన్ని పెంచి కౌలు రైతులకు కూడా ఇస్తే బాగుంటుంది. పంట బీమా కూడా వర్తింపజేస్తే మేలు జరుగుతుంది’ అని పేర్కొన్నారు. కౌలు రైతును ఆదుకునేందుకు రుణమాఫీ తరహాలో ఏదైనా ఆర్థికసాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. తెలంగాణ విఠల్, టీజీకేడీ అధ్యక్షుడు పృథ్వీరాజ్, సోమిడి శ్రీనివాస్, జీఎల్ నరసింహారావు, పాండురంగాచారి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

