Somesh Kumar | సీఎం ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ సోమేశ్‌కుమార్
Somesh Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
Somesh Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రధాన సలహాదారుడిగా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సోమేశ్‌కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం కలెక్టర్ సహా వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు.
ఆ తర్వాత గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు ఏపీ కేడర్‌కు చెందిన అధికారిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత డీవోపీటీ ఏపీకి బదిలీ చేసింది. ఆ తర్వాత సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

