పటాన్చెరు రూరల్, జూలై 19: మా నవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని నాస్కామ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గీతం డీ మ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించిన 16వ స్నాతకోత్సవంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 2,002 మంది విద్యార్థులకు పట్టాలు, 32 మందికి బంగారు పతకాలు, వందమందికి పీహెచ్డీలు ప్రదానం చేశారు.
డాక్టర్ వెంకట్రామన్, అరుణాచలం మురుగనాథం, వెంకటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్లు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కార్నిక్ మాట్లాడుతూ కృత్రిమమేధస్సు యుగంలో నిరంతర అభ్యాసం అవసరమన్నారు. ప్రభావవంతమైన నాయకత్వం, టీమ్ వర్క్, భావోద్వేగ మేధస్సు, స్వీయ అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని సూచించారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్ మాట్లాడుతూ పట్టాలను స్వీకరిస్తున్న వారు తమ కలలను నిజం చేసుకోవాలని సూచించారు.