హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎల్బీసీ టన్నెల్లో అన్వేషణ కొనసాగించలేమని రెస్క్యూ అధికారులు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్ పైకప్పు బలహీనంగా ఉన్నదని, అది కూలిపోయే అవకాశం ఉన్నదని, మొండిగా ముందుకెళ్తే రెస్క్యూ కార్మికు లు మరో ప్రమాదంలో చిక్కుకునే ప్ర మాదం పొంచి ఉన్నదని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు స మాచారం. గల్లంతైన ఏడుగురి ఆచూకీ లభించేవరకు అన్వేషణ కొనసాగాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తె లిసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమా దం, సహాయ చర్యల పురోగతిపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులు, మంత్రుతో సమీక్షించారు. సహాయ చర్యల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను నియమించాలని సీఎస్‌కు సూచించినట్టు తెలిసింది.