హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో తెలంగాణలో పనిచేసిన అమ్రపాలి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) ఉత్తర్వుల మేరకు ఇక్కడ రిలీవై ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు.
డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ తనను తెలంగాణకే కేటాయించాలని ఆమె క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను అనుమతించిన క్యాట్ ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.