Gurukul TGT | హైదరాబాద్, ఏప్రిల్27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. పాఠ్యాంశాల వారీగా, జోన్ల వారీగా పోస్టులు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తదితర అంశాల పూర్తి వివరాలను శుక్రవారం నుంచి www.treirb.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తెలిపింది. శుక్రవారం నుంచి మే 27 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని వెల్లడించింది. 4,006 టీజీటీ ఉద్యోగాల్లో 3,011 (75.17శాతం) పోస్టులు మహిళలకే కేటాయించడం విశేషం. మిగతా 995 (24.83%) పోస్టులు పురుషులకు దక్కనున్నాయి.
9,231 పోస్టులకు నోటిఫికేషన్ పూర్తి
అన్ని గురుకులాలకు ప్రభుత్వం 11, 687 పోస్టులను మంజూరు చేసింది. అందులో బోధన సిబ్బందికి 10,675 పోస్టులు కాగా, మిగిలినవి 1,012 బోధనేతర పోస్టులు. బోధన సిబ్బంది పోస్టులను ట్రిబ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. బోధనేతర సిబ్బంది పోస్టుల్లో స్టాఫ్‌నర్స్ పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనున్నది. కాగా, గురువారం నాటికి గురుకులాల్లో ఆయా పోస్టులకు సంబంధించి దాదాపు 44 వేల మంది అభ్యర్థులు ఒటీఆర్ చేసుకొన్నట్టు అధికారులు వెల్లడించారు.
P