హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించింది. రూ. 1800కోట్ల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా, ఈఆర్సీ ఆమోదించలేదు. దీంతో విద్యుత్తు చార్జీల పెంపునకు బ్రేక్‌పడింది. మొత్తంగా చార్జీల వడ్డన ఉంటుందని కంగారుపడ్డ వినియోగదారులకు ఈఆర్సీ నిర్ణయంతో ఉపశమనం కలిగింది. సోమవారం ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ భవన్లో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు, సభ్యులు బండారు కృష్ణయ్య, మనోహర్‌రాజు ఈఆర్సీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. డిస్కంలు ప్రతిపాదించిన చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించామని, చార్జీల్లో ఎలాంటి మార్పులుండవని ప్రకటించారు. అయితే కొన్ని క్యాటగిరీల్లో మార్పులతో 0.47శాతం టారిఫ్రేట్లు పెరిగాయని వివరించారు. దీంతో సామాన్య, మధ్యతరగతి వారిపై భారం పడదని తెలిపారు. అయితే కొన్ని కేటగిరి వినియోగదారుల ఫిక్స్డ్ చార్జీలను పెంచారు. విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 పిటిషన్లపై ఈ మేరకు నిర్ణయం వెల్లడించింది.
ఫిక్స్డ్ ఛార్జీల పెంపు ఇలా..