హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో క్రయవిక్రయాల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు వచ్చినవారు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆధార్ ఆన్లైన్ సేవల్లో (ఈ-కేవైసీ) అంతరాయం కారణంగా ఈ సమస్య తలెత్తినట్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి మూడునాలుగు రోజులుగా అప్పుడప్పుడూ సమస్య ఎదురవుతున్నది.
గురువారం పూర్తిగా నిలిచిపోయాయి. ఆధార్ నెట్‌వర్క్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఓటీపీ సేవలు, రిజిస్ట్రేషన్స్ సేవలు నిలిచిపోయాయని ఆ శాఖ తెలిపింది. నిలిచిన రిజిస్ట్రేషన్లను శుక్రవారానికి బదిలీ చేశామని వెల్లడించింది.