హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): గత నాలుగు శుక్రవారాల్లో తిరుమల శ్రీవారిని రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకున్నట్టు టీటీడీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం సాధారణంగా అభిషేక సేవ కారణంగా భక్తుల దర్శన సమయం రెండు మూడు గంటలు తగ్గుతుందని పేర్కొన్నది. అయితే ప్రతి శుక్రవారం సాధారణంగా 60-65 వేలమంది శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపింది. కానీ మే 23న 74,374, మే 30న 71,721, ఈనెల 6న 72,174, 13న 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపింది.