సంతానోత్పత్తిపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావం ఉండదు
సంతానోత్పత్తిపై కొవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావం చూపుతుందన్న ప్రచారానికి తాజా అధ్యయనం చెక్ పెట్టింది. సంతానోత్పత్తిపై కొవిడ్ వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపదని ఈ అధ్యయనం తేల్చింది. దాదాపు 60 వేల మంది మహిళలపై స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘ది జర్నల్ కమ్యూనికేషన్ మెడిసిన్' ప్రచురించింది.
- స్వీడన్ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడి
- అపోహలతో ఆందోళనచెందొద్దని స్పష్టీకరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : సంతానోత్పత్తిపై కొవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావం చూపుతుందన్న ప్రచారానికి తాజా అధ్యయనం చెక్ పెట్టింది. సంతానోత్పత్తిపై కొవిడ్ వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపదని ఈ అధ్యయనం తేల్చింది. దాదాపు 60 వేల మంది మహిళలపై స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘ది జర్నల్ కమ్యూనికేషన్ మెడిసిన్’ ప్రచురించింది. గర్భస్రావాలు, శిశు జననాలపై సైతం కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావం లేదని తెలిపింది. గతంలో కొవిడ్-19 పాండెమిక్ మొదలవగానే మానవ ఫలదీకరణ (ఫెర్టిలిటీ)పై ఈ వ్యాక్సిన్ తీవ్ర ప్రభావం చూపుతుందని సోషల్ మీడియాలో పుకార్లు జోరందుకున్నాయి. ఈ వ్యాక్సిన్ వినియోగంతో మహిళలు గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయంటూ ప్రచారం జరిగింది. కొవిడ్ సంక్షోభం తర్వాత కొన్ని దేశాల్లో శిశు జననాలు తగ్గడం ఈ ప్రచారాన్ని మరింత బలపర్చింది. ఈ నేపథ్యంలో స్వీడన్‌కు చెందిన పరిశోధకులు 18-45 ఏండ్ల మధ్య వయసున్న దాదాపు 60 వేల మంది మహిళల మెడికల్ రికార్డులను పరిశీలించారు.
2021-24 మధ్య కాలంలో ఎంఆర్ఎన్ఏ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న, వేయించుకోని మహిళల్లో ప్రసవాల రేట్లు, గర్భస్రావాలను పోల్చి చూశారు. తద్వారా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సంఖ్యాపరంగా ప్రసవాలు, గర్భస్రావాల్లో గణనీయ తేడాలేమీ లేవని గుర్తించారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావంపై గతంలో అనేక పరిశోధనలు జరిగినప్పటికీ అవన్నీ కేవలం గర్భాధారణపైనే దృష్టి సారించాయని ఈ అధ్యయనం గుర్తుచేసింది. ప్రస్తుత అధ్యయనంలో సంతానోత్పత్తి చికిత్స పొందుతున్న వారిని సైతం పరిగణనలోకి తీసుకోవడంతోపాటు వయస్సు, అనారోగ్య సమస్యలు, గర్భధారణ రేటును ప్రభావితం చేసే ఇతర అంశాలపై కూడా దృష్టి సారించామని వివరించింది. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న మహిళలు గర్భాదారణ విషయంలో అపోహలతో ఆందోళనకు గురికావొద్దని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

