తెలంగాణకు ఆర్బీఐ ఊరట.. ప్రభుత్వం తీసుకునే చేబదులు రుణాల పరిమితి 13.5% పెంపు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పటిష్ట పునాదులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అవి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌కు కలిసొస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన రిజర్వు బ్యాంకు..
- రూ.2,407 కోట్ల నుంచి రూ.2,733 కోట్లకు చేరిక
- బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంస్కరణలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రయోజనం
- నగదు నిర్వహణలో అదనంగా రూ.326 కోట్ల వెసులుబాటు
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పటిష్ట పునాదులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అవి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌కు కలిసొస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన రిజర్వు బ్యాంకు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్’ (స్వల్పకాలిక చేబదులు రుణాల) పరిమితిని ఏకంగా 13.5% పెంచడమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ హయాంలో స్థిరంగా బలమైన రెవెన్యూ వృద్ధి నమోదవడమే ఇందుకు కారణం. దీంతో ప్రభుత్వ తాతాలిక ఖర్చులు, రాబడుల మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఉపయోగపడే డబ్లూఎంఏ పరిమితి రూ.2,407 కోట్ల నుంచి రూ.2,733 కోట్లకు చేరింది.
తద్వారా స్వల్పకాలిక నగదు నిర్వహణలో రేవంత్‌రెడ్డి సర్కార్‌కు అదనంగా రూ.326 కోట్ల వెసులుబాటు లభించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల 2023-24 నాటికి తెలంగాణ రెవెన్యూ రాబడులు రూ.1,69,293 కోట్లకు పెరిగాయి. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024-25 ఇవి రూ.1,67,804 కోట్లకు పడిపోయాయి. గత మూడేండ్లలో ఏటా సగటున రూ.1,65,662 కోట్ల రెవెన్యూ రాబడులు మాత్రమే వచ్చాయి. ఆర్బీఐ తాజాగా రాష్ట్ర డబ్లూఎంఏ పరిమితి పెంపునకు ఈ సగటే ప్రధాన ఆధారమైంది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్ట ఆర్థిక సంసరణల వల్లే ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ప్రయోజనం దకింది.
రాబడుల్లో మందగించిన వృద్ధి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రెవెన్యూ రాబడుల వృద్ధి మందగించింది. బడ్జెట్ అంచనాల కంటే వాస్తవ ఆదాయం భారీగా తగ్గుతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2.29 లక్ష కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తర్వాత ఆ అంచనాను రూ.2.03 లక్ష కోట్లకు కుదించింది. చివరికి అధికారిక గణాంకాల ప్రకారం వచ్చిన వాస్తవ రాబడులు 1.67 లక్ష కోట్లు మాత్రమే. దీనిపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే కాలంలో రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం, రుణ సేకరణ పరిమితులు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

