బోనకల్లు, ఏప్రిల్ 16: యూపీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య ఆలిండియా 938వ ర్యాంకు సాధించింది. అలేఖ్య తండ్రి ప్రకాశ్‌రావు మధిర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఉన్నారు.
నాన్న కోరికను నెరవేర్చా : చిన్ననాటి నుంచి బాగా చదివి ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మా నాన్న చెప్తుండేవారు. ఇంటర్ తర్వాత బీటెక్ కాకుండా డిగ్రీ చదివాను. సివిల్స్ సాధించి నాన్న కోరిక నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉన్నది.
-సాయి అలేఖ్య