సహకరిస్తేనే రేషనలైజేషన్ సమస్య పరిష్కారం
రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సమిష్టిగా కూర్చోని మాట్లాడితే రేషనలైజేషన్ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.
- ఉపాధ్యాయ సంఘాల నేతలు,రాజకీయ నాయకులు చొరవ చూపాలి
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
బోయినపల్లి, జూన్ 14: రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సమిష్టిగా కూర్చోని మాట్లాడితే రేషనలైజేషన్ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతోపాటు ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ఉపాధ్యాయ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
రేషనలైజేషన్ అనేది పెద్ద సమస్య అని, విజ్ఞులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే సమస్య ఏ విధంగా పరిష్కారమవుతుందని, ఈ విషయమై రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవ సేనను అడిగినట్టు చెప్పారు. అందుకు ఆమె పని విభజన పేరిట ఉపాధ్యాయులు పని చేయాలని రాష్ట్రంలోని అన్ని డీఈవో కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారని ఆయన పేర్కొన్నారు. జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు కూడా మానవతా దృక్పథంతో అదే పాఠశాలలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన చేయాలని, ఆ విద్యార్థులు మళ్లీ అదే జడ్పీ పాఠశాలకు వస్తారని వినోద్‌కుమార్ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దే ఉపాధ్యాయులు పునరాలోచించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

