హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): మిగిలిపోయిన భాషా పండిట్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్, సంచాలకుడు నవీన్ నికోలస్‌కు రాష్ట్రీయ పండిత పరిషత్ నాయకులు విజ్ఞప్తిచేశారు. గురువారం ఆయనను ఆర్‌యూపీపీ టీజీ-1927 రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ కలిశారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణాను కలిసి సమస్యలపై చర్చించారు.